యాదాద్రి భువనగిరి : జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతున్నది. రోజురోజుకు బీఆర్ఎస్లోకి వలసలు కొన సాగుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా జిల్లా కాంగ్రెస్ ఓబీసీ అధ్యక్షుడు గోధ రాహుల్ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సుమారు 200 మందితో కలిసి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి(MLA Shekhar Reddy ), చింతల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం పగటి కలే అన్నారు. ఆ పార్టీ వైభవం గత చరిత్రే అన్నారు. మూడోసారి బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమన్నారు. ఈ కార్య క్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జనగాం పండు, నీల ఓం ప్రకాష్ గౌడ్, మాజీ సింగల్విండ్ చైర్మన్ బల్గూరి మధుసూదన్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆబ్బగాని వెంకట్ గౌడ్, జెక్క రాఘవేందర్ రెడ్డి, శ్రీనివాస్, గోదా శ్రీను, గోదా నరేందర్, చిన్నం శ్రీను, తదితర పాల్గొన్నారు.