వరంగల్ : పేదల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో పాటుపడుతుందని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని పేర్కొన్నారు. తాజాగా
రాయపర్తి మండలం శివరామపురం(ఆర్ అండ్ ఆర్ కాలనీ) కి చెందిన కాంగ్రెస్ నాయకులు చెడుపాక సుమన్, ప్రభాకర్, చిన్న సోమయ్య, సంపత్, సోమిరెడ్డి, యాకయ్య తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి గులాబీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా, పేదింటి ఆడపిల్లల పెండ్లి కోసం కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల ద్వారా రూ.1,00,116 మేనమామ కట్నంగా ప్రభుత్వం అందజేస్తున్నదని చెప్పారు.
వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యంగులు, వృద్ధులకు, బీడీ కార్మికులకు ప్రభుత్వం పెన్షన్ అందజేస్తున్నదని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ ఎమ్మెల్యే చిరుమర్తి పిలుపునిచ్చారు