జగిత్యాల : బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా గొల్లపల్లి మండలం గుంజపడుగు గ్రామం కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు గురువారం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరుతున్న గుల్లకోట గ్రామ కాంగ్రెస్ నేతలు
అలాగే ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామం బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు బుర్ర సాయి కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి 30 మంది కార్యకర్తలు మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బిసగోని శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు బుర్ర విజయ్, మడ్డి మహేష్, తదితరులు పాల్గొన్నారు.