హైదరాబాద్,నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : మావోయిస్టుల ఎన్కౌంటర్లపై అనుమానాలున్నాయని న్యాయవిచారణ జరిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. బూటకపు ఎన్కౌంటర్లను సీపీఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నట్టు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హిడ్మా ఎన్కౌంటర్తో పాటు, బుధవారం మరో ఎన్కౌంటర్ జరిగిందని, పేర్కొన్నారు. విజయవాడ, తదితర ప్రాంతాల్లో 50మందికి పైగా మావోయిస్టులను అరెస్టు చేశారని, వారిని వెంటనే కోర్టు ముందు హాజరుపరచాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపి ఈ సమ స్య పరిషారించాలని కోరారు.
దేవ్జీని కోర్టులో ప్రవేశ పెట్టాలి ; కుటుంబ సభ్యుల డిమాండ్
కోరుట్ల, నవంబర్ 19: మావోయిస్టు పా ర్టీ అగ్రనేత, సెంట్రల్ కమిటీ సెక్రటరీ, కోరుట్లకు చెందిన తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్ జీ ఏపీ పోలీసుల అదుపులో ఉన్నారన్న సమాచారంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తిరుపతిని అరె స్ట్ చేస్తే కోర్టులో ప్రవేశపెట్టాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. దేవ్జీ సోదరుడు గంగాధర్ ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. దేవ్జీ ఎకడ ఉన్నా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్టు వివరించాడు. మీడియాలో వస్తున్న కథనాలు తమను తీవ్ర వేదనకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు.