హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గురుకుల హాస్టళ్లలో ఫుడ్‌పాయిజనింగ్ ఘటనలు జరుగుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఆరోపించారు. కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై కింగ్ కోఠి, నిలోఫర్ దవాఖానల్లో చికిత్స పొందుతున్న బాగ్‌లింగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులను ఆదివారం పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాగ్‌లింగంపల్లి ఘటనను దాచేందుకు యత్నించిన ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. మానవహక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించినప్పటికీ సర్కారులో చలనంలేకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా కండ్లు తెరిచి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, డిసెంబర్14 (నమస్తే తెలంగాణ): బీసీ రిజర్వేషన్లపై విధించిన 50% పరిమితిని తొలగించాలని, అసెంబ్లీ తీర్మానం చేసిన బిల్లులను పార్లమెంట్లో ఆమోదించాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నేడు, రేపు ఢిల్లీలో ధర్నాను నిర్వహించనున్నట్టు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అందుకోసం బీసీ సంఘాల నేతలతో కలిసి ఢిల్లీకి వెళుతున్నట్టు వెల్లడించారు. ధర్నాతోపాటు, ఢిల్లీ పర్యటనలో కేంద్ర ప్రభుత్వ పెద్దలను, ప్రతిపక్ష నేతలను కలిసి బీసీ బిల్లు ఆవశక్యతను వివరిస్తామని తెలిపారు. కాగా, ఢిల్లీ వెళ్లిన వారిలో బీసీ జేఏసీ వరింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్‌గౌడ్, మణి మంజరి, కాటేపల్లి వీరస్వామి, కౌల జగన్నాథం, నందగోపాల్, గూడూరు భాసర్, స్వర్ణ, గౌతమి, శ్రీనివాస్‌గౌడ్, వెంకటేశ్‌గౌడ్, శ్రీనివాసచారి, బండిగారి రాజు తదితరులున్నారు.