యువతకు ఉపాధి కోసం దేనికైనా సిద్ధం
యువత ఉద్యోగాల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని మాజీ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్‌లో మూతపడిన సిమెంటు పరిశ్రమ (సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) విషయంలో ఆదిలాబాద్ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆగస్టు చివరినాటికి స్పష్టమైన వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేశారు.
- సీసీఐపై ఎంపీ, ఎమ్మెల్యేలు స్పష్టమైన వైఖరి వెల్లడించాలి
- మాజీ మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్, జూలై 17 ( నమస్తే తెలంగాణ) : యువత ఉద్యోగాల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని మాజీ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్‌లో మూతపడిన సిమెంటు పరిశ్రమ (సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) విషయంలో ఆదిలాబాద్ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆగస్టు చివరినాటికి స్పష్టమైన వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేశారు. సిమెంటు పరిశ్రమ పునఃప్రారంభమైతే 5 వేల మంది యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎంపీ, ఎమ్మెల్యేలు పరిశ్రమ ప్రారంభ విషయాన్ని స్పష్టం చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణత్యాగానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పది సంవత్సరాల నుంచి సిమెంటు పరిశ్రమను తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నదని చెప్పారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడంతోపాటు కేటీఆర్ రాష్ట్ర పరిశ్రమల మంత్రిగా ఉన్న సమయంలో మంత్రులు, ఎంపీల బృందం కేంద్ర మంత్రులను కలిసి పలు వినతులు అందజేసినట్టు గుర్తుచేశారు. ఇండస్ట్రియల్ కారిడార్ విషయంలో ఆసక్తి చూపుతున్న బీజేపీ ఎమ్మెల్యే సీసీఐ విషయాన్ని ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు కేంద్రం విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రారంభిస్తున్నదని, సీసీఐ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. గతంలో ఆదిలాబాద్‌లో పర్యటించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, మాజీ మంత్రి హన్స్‌రాజ్ గంగారం సీసీఐని ప్రారంభిస్తామని హామీ ఇచ్చినా ఫలితం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్పై విమర్శలు మానుకుని సీసీఐ పునఃప్రారంభం విషయంలో దృష్టి సారించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

