ఆదిలాబాద్, అక్టోబర్ 22(నమస్తే తెలంగాణ) : బూటకపు హామీలతో ప్రజలను మోసం చేసిన సీఎం రేవంత్‌రెడ్డిపై చీటింగ్ కేసు నమోదు చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలంను కలిసి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఉట్నూర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైన విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చక సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేశారని పేర్కొన్నారు.