కవాడిగూడ, ఏప్రిల్ 16: డీఎస్సీ 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులకు వెంటనే ఉద్యోగాలివ్వాలని డీఎస్సీ 1998 క్వాలిఫైడ్ తెలంగాణ రాష్ట్ర యూ నియన్ డిమాండ్ చేసింది. డీఎస్సీ 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డీఎస్సీ 1998 క్వాలిఫైడ్ తెలంగాణ రాష్ట్ర యూనియన్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద గురువారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు ఎండీ ఖాసీం, పుట్టోజు నారాయణాచారి, చెన్న రఘు, శ్రీనివాసులు, రాములు, విజయభాస్కర్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహిం చిన డీఎస్సీ 1998లో ఉపాధ్యాయ నియామకాల్లో అధికారులు అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు.
నాడు జరిగిన నియామకాల్లో స్థానికులను కాదని, నాన్‌లోకల్ అభ్యర్థులను ఉపాధ్యాయులుగా నియమించారని తెలిపారు. తెలంగాణలో అర్హులైన అభ్యర్థులు ఉన్నప్పటికీ క్యారీ ఫార్వర్డ్ చేశారని, ఇది నోటిఫికేషన్‌కు విరుద్ధమని అన్నారు. నాటి నుంచి నేటి వరకు డీఎస్సీ 1998 అభ్యర్థులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ.. చాలామంది ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో శ్రీరాములు, సత్యనారాయణరెడ్డి, బాలరాజు పాల్గొన్నారు.