హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పాఠశాలల్లోని 74,423 మంది దివ్యాంగ విద్యార్థులకు ఇరవై ఏండ్లుగా బోధిస్తున్న ఐఈఆర్పీ(ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్‌పర్సన్స్)కు ఉద్యోగ భద్రత కల్పించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టు 2025 మార్చి 7న ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకొని వెంటనే స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తిచేశారు.