హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): రోడ్లు భవనాల శాఖలో 118 మంది సహాయ ఇంజినీర్ల(ఏఈఈ)కు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు(డీఈఈ)గా ఉద్యోగోన్నతి కల్పిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. డీపీసీ ప్యానల్ నిబంధనల మేరకు ప్రభుత్వం ఉద్యోగోన్నతులు కల్పించినట్టు మంత్రి కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో పెండింగ్ పదోన్నతుల అంశాన్ని పరిష్కరించడంపై ఇంజినీర్లు హర్షం వ్యక్తంచేశారు.
న్యాక్ అక్రిడేషన్ కోసం లంచాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): న్యాక్ అక్రిడిటేషన్ కోసం లంచాలు ఇచ్చారంటూ గుంటూరులో ని కేఎల్ ఈఎఫ్ యూనివర్సిటీపై సీబీ ఐ అధికారులు కేసు నమోదు చేశారు. శనివారం గుంటూరుతోపాటు భోపా ల్, ఢిల్లీ తదితర 20 ప్రాంతాల్లో సీబీ ఐ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. రూ.37లక్షల నగదును స్వాధీ నం చేసుకున్నట్టు సమాచారం. వీసీ సారథి వర్మ, వైస్ ప్రెసిడెంట్ కోనేరు రాజాహారం, డైరెక్టర్ రామకృష్ణ, న్యాక్ ఇన్స్పెక్షన్ కమిటీ చైర్మన్ సమీంద్రనాథ్తోపాటు న్యాక్ కమిటీలో ఉన్న పది మంది సభ్యులను అరెస్ట్ చేశారు.