హైదరాబాద్, జనవరి10 (నమస్తే తెలంగాణ) : మెడికల్ కోడింగ్ రంగంలో అపార ఉద్యోగావకాశాలు ఉన్నట్టు సొల్యూషన్స్ 3 ఎక్స్ సంస్థ సీఈవో ముత్తుకుమారన్ గాంధీ తెలిపారు. హైదరాబాద్ అమీర్‌పేటలో సొల్యూషన్స్ 3 ఎక్స్ ట్రైనింగ్ సెంటర్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏటా 3 వేలకు పైగా, అంతర్జాతీయంగా 50 వేల మంది రిక్రూట్ అవుతున్నట్టు తెలిపారు. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి 20 వేల నుంచి 40 వేల వరకు ప్రారంభ వేతనం లభిస్తుందని వెల్లడించారు.