హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): వరంగల్ మడికొండలోని ఐటీసెజ్లో క్వాడ్రంట్ ఆఫీస్‌లో ఈ నెల 18న జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. ఈ జాబ్‌మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. టెక్ మహీంద్రా, జెన్‌ప్యాక్, క్వాడ్రంట్, వరుణ్ మోటర్స్, అపోలో, టాటా స్ట్రైవ్, వన్‌స్టాప్, వీ3టెక్, ఏఆర్ఎస్ వంటి 35 కంపెనీలు ఈ మేళాలో పాల్గొంటున్నట్టు ఆయన బుధవారం ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా 1,500 నుంచి 2వేల మంది అభ్యర్థులకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉన్నదని కేటీఆర్ తెలిపారు.