హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) :‘ఇంటిగ్రెటెడ్ డబుల్ డిగ్రీ మాస్టర్స్ ప్రోగ్రామ్(ఐడీడీఎంపీ) కోర్సులో ప్రవేశాలకు ఈ నెల 28న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు జేఎన్టీయూ తెలిపింది.
బీటెక్+ఎంటెక్ను కేవలం ఐదేండ్లలోనే పూర్తి చేసేందుకు స్వీడన్లోని బ్లెంకింగ్జె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భాగస్వామ్యంతో ఈ కోర్సు నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది. అర్హులైన విద్యార్థులు అన్నిరకాల ఒరిజినల్ సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్కు హాజరుకావాలని సూచించింది. వివరాలకు జేఎన్టీయూ అధికారిక వెబ్సైట్ను చూడాలని కోరింది.