హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వాన్ని కించపరిచేలా స్కిట్‌ను ప్రదర్శించినందుకు గానూ బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని హయత్ నగర్ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు.
జూన్ 2వ తేదీన ఓ కార్యక్రమంలో సీఎంను కించపరిచేలా స్కిట్ ప్రదర్శించారని టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్ రెడ్డి హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ స్కిట్‌కు సంబంధించిన వీడియోలను పరిశీలించిన అనంతరం ఇవాళ తెల్లవారుజామున ఘట్కేసర్లో పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో బాలకృష్ణారెడ్డితో పాటు రాణి రుద్రమ, దరువు ఎల్లన్న పేర్లు కూడా ఉన్నాయి.