కొత్త గవర్నర్ సీపీ రాధాకృష్ణన్
రాష్ట్ర నూతన గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ నియమితులయ్యారు. తమిళిసై సౌందరరాజన్ రాజీనామాతో జార్ఖండ్ గవర్నర్‌గా ఉన్న రాధాకృష్ణన్‌కు తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
- జార్ఖండ్ గవర్నర్‌కు తెలంగాణ అదనపు బాధ్యతలు
- ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- నేడు రాజ్‌భవన్‌లో గవర్నర్‌గా బాధ్యతల స్వీకరణ
- గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు
హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర నూతన గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ నియమితులయ్యారు. తమిళిసై సౌందరరాజన్ రాజీనామాతో జార్ఖండ్ గవర్నర్‌గా ఉన్న రాధాకృష్ణన్‌కు తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు మంగళవారం ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా కూడా ఆయనకే అదనపు బాధ్యతలను అప్పగించారు. బుధవారం ఉదయం రాధాకృష్ణన్ తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. మంగళవారం రాత్రి 8.20కి జార్ఖండ్ నుంచి బయల్దేరి రాత్రి 11.05 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకోనున్నారు. బుధవారం రాజ్‌భవన్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే.. గవర్నర్‌గా రాధాకృష్ణన్‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
తాజా, మాజీలు ఇద్దరూ తమిళనాడు బీజేపీ అధ్యక్షులే
మాజీ గవర్నర్ తమిళిసై, ప్రస్తుత గవర్నర్ రాధాకృష్ణన్ మధ్య పలు అంశాల్లో సారూప్యత ఉన్నది. ఈ ఇద్దరు కూడా తమిళనాడుకు చెందిన వారే. ఇద్దరూ తమిళనాడు బీజేపీలో కీలక నేతలే. ఆరెస్సెస్ భావజాలం కలిగిన రాధాకృష్ణన్ రాష్ట్ర బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. 1998, 1999లో కోయంబత్తూర్ నుంచి ఎంపీగానూ గెలుపొందారు. ఆ తర్వాత 2004, 2014, 2019లో ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2004 నుంచి 2007 వరకు బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు. తమిళిసై కూడా 2014 నుంచి 2019 వరకు బీజేపీ తమిళనాడు అధ్యక్షురాలిగా కొనసాగడం గమనార్హం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

