హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ ఫొటోను కరెన్సీనోట్లపై ముద్రించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో బుధవారం వందలాది కళాకారులు ధూంధాం నిర్వహించారు. కరెన్సీపై అంబేదర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జేరిపోతుల పరశురామ్ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యు డు ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్‌రావు, ఎంపీ ఈటల రాజేందర్, కలిశెట్టి అప్పలనాయు డు, డాక్టర్ ఏపూరి సోమన్న, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, ఆళ్ల రామకృష్ణ, కళాకారులు పొల్లాల వాణి, గంగా తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, మార్చి26 (నమస్తే తెలంగా ణ): కుల సంఘాలు, బీసీ సంఘాల నేతలు విభేదాలను వీడాలని బీసీ ఐక్య కూటమి కన్వీనర్ దాసు సురేశ్ కోరారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 42 శాతం రిజర్వేషన్ల అమలు, దేశవ్యాప్త కులగణన, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల కోసం ఉద్యమించాలని సూచించారు. సమన్వయంతో కదిలితేనే 42 శాతం రిజర్వేషన్ల అమలు సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.