ఖలీల్‌వాడి, జూన్ 29 : చంద్రబాబు, రేవంత్ డైరెక్షన్లో నడుస్తున్న పచ్చమీడియా కంపు తెలంగాణకు తలవంపుగా మారిందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మండిపడ్డారు. ఎల్లో మీడియా తెలంగాణలో తిష్టవేసి జర్నలిజం ముసుగులో రాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా, కేసీఆర్ ఫ్యామిలీ ప్రతిష్ఠను మసకబార్చేలా గేమ్ ఆడుతున్నదని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. ఆంధ్రా పత్రికలు, టీవీలు కేసీఆర్ ఫ్యామిలీని, బీఆర్ఎస్ను టార్గెట్‌గా చేసుకుని విషపు రాతలు రాస్తున్నాయని విమర్శించారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకనే కేటీఆర్‌పై ఎల్లో మీడియా దుష్ప్రచారం సా గిస్తున్నదని మండిపడ్డారు. కేటీఆర్ ను వ్యక్తిగతంగా కించపరిచేలా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.