ఫిరాయింపుదారులతో కాంగ్రెస్‌ను నింపేశారు.. రాజీనామా సభలో విరుచుకుపడ్డ జీవన్‌రెడ్డి
రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఫిరాయింపుదారులతో నింపేశారని, పార్టీని పూర్తిగా భ్రష్టుపట్టిస్తున్నారని మాజీ మంత్రి టీ జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రాహుల్‌గాంధీ సిద్ధాంతాలకు విరుద్ధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన పెట్టుబడిదారీవర్గం వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. పార్టీలో అవమానించి, బాధించి బయటకు పంపిస్తున్న రేవంత్‌రెడ్డిపైనే తన పోరాటం సాగుతుందని స్పష్టంచేశారు.
- దానం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ, కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేయడమేంటి?
- వేం నరేందర్‌రెడ్డి ఎవరు? పార్టీకి చేసిందేంది?
- పోచారానికీ, కాంగ్రెస్‌కు ఏం సంబంధం?
- రేవంత్ పెట్టిన టార్చర్ అంతా ఇంతా కాదు
- ఆత్మగౌరవం లేని చోట పనిచేయలేను
- ఇకపై సీఎం రేవంత్ రెడ్డిపైనే నా పోరాటం
- ఇక ఎంతమందిని తొక్కుతావో చూస్తా
జగిత్యాల, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఫిరాయింపుదారులతో నింపేశారని, పార్టీని పూర్తిగా భ్రష్టుపట్టిస్తున్నారని మాజీ మంత్రి టీ జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రాహుల్‌గాంధీ సిద్ధాంతాలకు విరుద్ధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన పెట్టుబడిదారీవర్గం వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. పార్టీలో అవమానించి, బాధించి బయటకు పంపిస్తున్న రేవంత్‌రెడ్డిపైనే తన పోరాటం సాగుతుందని స్పష్టంచేశారు. ఎంతమందిని తొక్కుతావో చూస్తానని సీఎంకు సవాల్ విసిరారు. ఏడు పదుల వయసులో కొందరు స్వార్థపరుల వల్ల తాను మరోసారి పోరాటం మొదలు పెట్టాల్సిన పరిస్థితి నెలకొన్నదని, ఇది జీవితంలో తన ఆఖరి పోరాటమని చెప్పారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బండారి గార్డెన్లో బుధవారం వేలాదిమంది కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఏఐసీసీ సభ్యత్వానికి జీవన్‌రెడ్డి రాజీనామా చేశా రు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాజీ మంత్రి తీవ్ర ఆవేదనతో భావోద్వేగానికి లోనవుతూ గంటన్నరపాటు ప్రసంగించారు. ‘బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను అదే పార్టీలో ఉండగానే, సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ గా పోటీ చేయించడం, ఆయన సభ్యత్వం పై చర్యలు లేకపోవడం ఏ విధమైన నీతి? పోచారం శ్రీనివాసరెడ్డి అనే వలసవాదికి ప్రభుత్వ సలహాదారు పదవి ఇస్తావా? ఆయన ఇచ్చిన సలహాలేంది? అందలం ఎందుకు? వేం నరేందర్‌రెడ్డి ఎవరు? ఆ యన పార్టీకి చేసిన సేవ ఏమిటి? ఆయనకు క్యాబినెట్ హోదా పదవి, రాజ్యసభ సభ్యత్వం అవసరమా?’ అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. పార్టీ మార్చి వచ్చిన వలసదారులను నెత్తిలో పెట్టుకొని పదేండ్లపాటు అష్టకష్టాలు పడుతూ, పోరాటం చేసిన నిజమైన నాయకులు, కార్యకర్తల గోసపోసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్ర శ్నించారు. చేవెళ్ల టికెట్ సునీతా మహేందర్‌రెడ్డికి ప్రకటించి, ఆ తరువాత బీఆర్ఎస్ నుంచి రంజిత్‌రెడ్డిని తెచ్చి ఇచ్చారని, అ క్కడ ఓటమికి సీఎం రేవంత్ కారణమని దుయ్యబట్టారు. దీని ప్రభావం వల్లే సికింద్రాబాద్, మహబూబ్‌నగర్‌ల్లోనూ కాంగ్రె స్ ఓటమి పాలైందని ఆరోపించారు.
కార్యకర్తను చంపితే సానుభూతి లేదు..
‘జగిత్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి నేను ప్రతిపాదించిన మారు గంగారెడ్డి రాజకీయ ప్రత్యర్థుల చేతిలో దారుణ హ త్యకు గురయ్యారు. నన్ను నమ్ముకున్న కా ర్యకర్త హత్యకు గురైనా ఆయన కుటుంబానికి కనీస న్యాయం చేయలేకపోయాను. బాధతో సీఎంకు, అధిష్ఠానానికి లేఖ రాసినా సానుభూతి లేద’ని పేర్కొన్నారు.
రేవంత్‌రెడ్డిపైనే నా పోరాటం
పీసీసీ అధ్యక్షుడు కావాల్సిన తనను కుట్రపూరితంగా బలిచేసి, అడుగడుగునా అవమానించి బయటకు పంపుతున్నాడని రేవంత్‌రెడ్డి తీరుపై జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి తరచూ తొక్కుకుంటూ వచ్చాను అనడం రివాజుగా మారిందని, ఇక ముందు జగిత్యాల నుంచి తొక్కడం ఆరంభం అవుతుందని హెచ్చరించారు. ఎంతమందిని తొక్కు తా వో చూస్తానంటూ సవాల్ విసిరారు. కాగా జీవన్‌రెడ్డి రాజీనామా ప్రకటిస్తూ, పత్రాలను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌కు పంపుతున్నట్టు ప్రకటించారు. జీవన్‌రెడ్డితోపాటు వేలాదిమంది కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు వేదికపై రాజీనామా ప్రకటించారు.
నన్ను పెట్టిన టార్చర్ అంతా ఇంతా కాదు
42 ఏండ్లపాటు నిబద్ధత కలిగిన కార్యకర్తగా, నాయకుడిగా పనిచేసిన తనను సీఎం రేవంత్‌రెడ్డి పెట్టిన టార్చర్ అంతా ఇంతా కాదని జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన పెట్టుబడిదారీ వర్గం తనను మానసిక క్షోభకు గురి చే సిందని, పార్టీలోకి ప్రత్యర్థిని తీసుకొని అడుగడుగునా అవమానించిందని వివరించారు. కాంగ్రెస్‌లో తనను అణగదొక్కేందుకు సీఎంతో పాటు ఆయన పెట్టుబడిదారులు కుట్ర చేశారని మండిపడ్డా రు. 2022లో తనకు సోనియాగాంధీ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తున్నట్టు చె ప్పారని, అయితే సీఎం, ఆయన పెట్టుబడిదారులు దాన్ని కుట్ర చేసి అడ్డుకున్నారని చెప్పారు. రాహుల్‌గాంధీ సి ద్ధాంతాలకు వ్యతిరేకంగా పార్టీ ఫిరాయింపులకు తెరలేపారని దుయ్యబట్టా రు. కాంగ్రెస్ 65 స్థానాలు కలిగి ఉన్నదని, ఒక స్థానంలో సీపీఐ సభ్యుడు ఉ న్నారని, ప్రతిపక్ష పార్టీల కంటే 20 మం ది సభ్యులు ఎక్కువగా ఉన్నారని వివరించారు.
అయినా పార్టీ ఫిరాయింపుల కు పాల్పడ్డారని మండిపడ్డారు. పదిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను దొడ్డిదారిన పార్టీలో కలుపుకొన్నారని విమర్శించారు. జగిత్యాల ఎమ్మెల్యేను ఉద్దేశపూర్వకంగా పార్టీలోకి తెచ్చి తనను, తన కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. ప్రతి విషయంలోనూ ఇబ్బందులు, అవమానాలకు గురిచేశారని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల వరకు వలసదారు ఎమ్మెల్యేకు ప్రభుత్వం సహకరిస్తూ వచ్చిందని, ము న్సిపల్ ఎన్నికల్లో పార్టీ సైతం వలసదారుడికే కొమ్ముకాసిందని దుయ్యబట్టా రు. ఈ విషయాన్ని మీనాక్షి నటరాజన్‌తోపాటు పార్టీ నాయకులకు చెప్పినా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆత్మగౌరవం లేనిచోట పనిచేయడం ఇష్టం లేక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. తనను ఏ శక్తీ ఆపలేదని, తన జీవితం అంతా పోరాటాల మయమేనని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

