జగిత్యాల, నవంబర్ 23 : జగిత్యాల నియోజకవర్గంలో సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ ఫిరాయింపుదారులకు మద్దతిస్తున్నారని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా గాజెంగి నందయ్య అభినందన సభ ఆదివారం జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌లో నిర్వహించారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమక్షంలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, ఇత్తేసీ పొత్తు కూడినట్టు ఇక్కడి ఎమ్మెల్యే పార్టీలో చేరారని ఎద్దేవాచేశారు. సన్నాయి నొక్కులు నొక్కుతూ ఎమ్మెల్యే సంజయ్ జగిత్యాల అభివృద్ధిలో భాగస్వామ్యం అంటూ పార్టీలో చేరారని పేర్కొనడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. తమ పోటీ పక్కవారితో కాదని, ముఖ్యమంత్రి వంటి నాయకులతో ఉంటుందని చెప్పారు.