హైదరాబాద్, అక్టోబర్ 28(నమస్తే తెలంగాణ): దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్-2025 షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. సెషన్-1కు సోమవారం నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరించనుండగా, జనవరి చివరివారంలో పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే, సెషన్-2కు జనవరి 31నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 1నుంచి 8 మధ్య పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష గడువు 3గంటలు కాగా, గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లలో సెక్షన్-ఏలో 20, సెక్షన్-బీలో 5ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో సబ్జెక్ట్‌లో 100మార్కుల చొప్పున మొత్తం 300మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
జేఈఈ మెయిన్స్-2025 షెడ్యూల్ వివరాలు
సెషన్-1
సెషన్-2