హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్ఐటీల్లో బీటెక్/ బీఈ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్-2 షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలను ఏప్రిల్ 1 నుంచి 8 వరకు నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ప్రకటించింది. ఈ నెల 25 రాత్రి 9 గంటలలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, రాత్రి 11:50 గంటల వరకు ఫీజు స్వీకరిస్తామని సంస్థ ప్రకటించింది. జేఈఈ మెయి న్స్-1 పరీక్షలను జనవరిలో నిర్వహించారు. జేఈ ఈ మెయిన్స్-2కు ఎప్సెట్ కు మధ్య వ్యవధి 20 రోజులే ఉండనుంది. ఈ ఏడాది ఎప్సెట్ను ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు నిర్వహించనున్నారు. జేఈఈ పరీక్షలు ముగిసిన తర్వాత ఎప్సెట్ జరగనుండగా విద్యార్థుల మధ్య ఒత్తిడి తగ్గే అవకాశాలున్నట్టు నిపుణులు అంచనాలేస్తున్నారు.