హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ) : జేఈఈ మెయిన్ పేపర్ -2 ఫలితాలు విడుదలయ్యాయి. జనవరి, ఏప్రిల్ మాసాల్లో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆదివారం విడుదల చేసింది. ఈ పరీక్షలోని బీఆర్క్ కోర్సు ఫలితాల్లో రాష్ర్టానికి చెందిన ముగ్గురు విద్యార్థులు సత్తా చాటారు. ఎస్సీ క్యాటగిరీ ఆలిండియా టాపర్‌గా వివేక్‌జిత్ దాస్ 99.94958 పర్సంటైల్ సాధించాడు.
ఆలిండియా ఎస్టీ క్యాటగిరీ టాపర్లుగా బోడ ప్రభంజన్దాస్ (99.87978 పర్సంటైల్), బానోత్ రిత్విక్ (99.87978 పర్సంటైల్) నిలిచారు. బీఆర్ పరీక్ష ఫలితాల్లో జార్ఖండ్‌కు చెందిన సులగ్న బేసాక్, తమిళనాడు విద్యార్థి ఆర్ ముత్తులు 100 పర్సంటైల్ సాధించారు. బీ ప్లానింగ్‌లో ఏపీ విద్యార్థి కొలసాని సాకేత్ప్రణవ్, కర్ణాటక విద్యార్థి అరుణ్రాధాకృష్ణన్లు 100 పర్సంటల్ సొంతం చేసుకొన్నారు. విద్యార్థులు ఫలితాల కొరకు jeemain.nta.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలి. మొత్తం 99,086 దరఖాస్తులు రాగా, 71,009 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.