హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్ దరఖాస్తుల గడువు ఈ నెల 30తో ముగియనున్నది. జేఈఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 1 నుంచి ప్రారంభమైంది. తుది గడువు సమీపిస్తుండటంతో, దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించాలన్న విజ్ఞప్తులు వస్తున్నాయి. డిసెంబర్ మొదటి వారంలో ఎడిట్ ఆప్షన్, అడ్మిట్కార్డులను పరీక్షకు మూడు వారాల ముందుగా విడుదల చేస్తారు. మెయిన్ పరీక్షను జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వరకు నిర్వహిస్తారు. ఇప్పటి వరకు 10 లక్షల వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది.