హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్-1 ఫలితాలు ఫిబ్రవరి 12న విడుదలకానున్నాయి. వీలైతే 12కు ముందే ఫలితాలు వెల్లడించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ/ఎన్టీఏ భావిస్తున్నది. జేఈఈ మెయిన్-1 పరీక్షలు ఈ నెల 21న ప్రారంభమయ్యాయి. పేపర్-1 పరీక్షలు బుధవారంతో ముగియగా, పేపర్-2 పరీక్షలు గురువారంతో ముగిశాయి.
ఒకటి, రెండు రోజుల్లో ప్రాథమిక కీ, విద్యార్థుల రెస్సాన్స్షీట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఆ తర్వాత అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఫైనల్ కీ ఖరారుచేసి, ఫిబ్రవరి 12 లోపు ఫలితాలు విడుదల చేయాలన్న ఆలోచనలో ఎన్టీఏ వర్గాలు ఉన్నాయి. ఈ పరీక్షలకు 13.5 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 95% మంది హాజరై ఉంటారని అంచనా.