హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : జేఈఈ మెయిన్ -1 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తాము పరీక్ష రాసే పట్టణాల వివరాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఏన్టీఏ) వెల్లడించింది. ముందస్తు సమాచారం నిమిత్తం అభ్యర్థులను అప్రమత్తం చేసేందుకు ఈ వివరాలు అని తెలిపింది. ఈ నెల 27, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో ఈ పరీక్షలను జాతీయంగా నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్‌కు ఈ ఏడాది 12 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్నారు.