హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : జేఈఈ అడ్వాన్స్ పరీక్ష షెడ్యూల్ వచ్చేసింది. ఈ పరీక్షను 2026 మే 17న నిర్వహించనున్నట్టు ఐఐటీ రూర్కీ వెల్లడించింది. నిర్వహణ బాధ్యతలను ఈ సారి ఐఐటీ రూర్కీకి అప్పగించారు. ఎప్పటిలాగే జేఈఈ మెయిన్‌లో క్వాలిఫై అయిన 2.5 లక్షల మంది అభ్యర్థులకు అడ్వాన్స్ పరీక్ష రాసే అవకాశం ఇస్తారు.
ఈ పరీక్ష రాసే వారు 2001 అక్టోబర్ 1 తర్వాత పుట్టి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులకు ఐదేండ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. అంటే వీరు 1996 అక్టోబర్ 1 తర్వాత జన్మించి ఉంటే సరిపోతుంది. ఈ పరీక్షను ఒక విద్యార్థి రెండుసార్లు మాత్రమే రాసే అవకాశం ఉంటుంది.