గద్వాల రూరల్, న వంబర్ 25: ‘కాంగ్రెస్ చెప్పేదొకటి.. చేసేదొకటి.. ఎన్నిక ల వేళ ఇచ్చే హామీ లు అమలు కావు. ఆ పార్టీ నేతలు చె ప్పే మాటలు నమ్మి ఓట్లేస్తే ఆగం కావడం ఖాయం’ అని జేడీఎస్ రాయిచూర్ జిల్లా అధ్యక్షుడు విరూపాక్ష హె చ్చరించారు. శనివారం ఆయన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జీవీకే ఫంక్షన్హాల్లో మీడియాతో మాట్లాడారు. కర్ణాటక ప్ర జలు కాంగ్రెస్ను నమ్మి అధికారం కట్టబెడితే ఆరు నెలలకే ఖజానా ఖాళీ అయిందని విమర్శించారు. కన్నడ ప్రభుత్వం ఇచ్చిన 5 గ్యారెంటీలు అమలు కావడం లేదని ధ్వజమెత్తారు. సిద్ధరామయ్య సర్కారు దివాలా తీసి హామీలను బుట్టదాఖలు చేసిందని అన్నారు. ఇప్పటికీ ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో అమలవుతున్న పరిస్థితులు కనిపించడం లేదని తెలిపారు. సాగు కోసం నాణ్యమైన కరెంట్ ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు రైతులను నిండా ముంచిందని మండిపడ్డారు. సరిపడా విద్యుత్తు సరఫరా లేక ఉన్న కరెంట్ కూడా పదేపదే కోతలతో వస్తుండటంతో కర్షకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటల కరెంటు ఇస్తూ అన్ని విధాలుగా రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో వ్యవసాయాన్ని పండుగలా మార్చిన విషయాన్ని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. తెలుగు ప్రజలు మరోసారి బీఆర్ఎస్కే పట్టంకట్టాలని పిలుపునిచ్చారు.