JC Diwakar Reddy | హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): రాయలసీమను తెలంగాణలో కలపాలని ఏపీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి కోరారు. రాయల తెలంగాణ ఏర్పాటు ద్వారా సీమలో సాగునీటి సమస్య తీరుతుందని అభిప్రాయపడ్డారు. రాయలసీమను కలుపుకోవడానికి ఎవరికీ అభ్యంతరం లేదని, తన వంతుగా ప్రజలను కూడగడతానని చెప్పారు.
సోమవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ర్టాలను విడగొట్టడం, కొత్తగా ఏర్పాటుచేయడం కష్టంకానీ, కలపడం సులభమేనని అన్నారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన కొందరు నేతలు ‘ప్రత్యేక రాయలసీమ’ అంటున్నారని , ఒక వేళ ప్రత్యేక రాయలసీమ వచ్చినా మంచిదేనని అన్నారు.