కృష్ణ కాలనీ, డిసెంబర్ 27 : ‘ఉత్త మాటలు వద్దు… ఉత్తర్వులు జారీ చేయాలి’ అని ఆశ వరర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి సర్కార్ను డిమాండ్ చేశారు. స మస్యలు పరిష్కరించాలని ఆశ వర్కర్లు 17రోజులుగా చేస్తున్న బస్సుజాత యాత్ర శుక్రవా రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చేరుకోగా ఆశ వరర్లు స్వాగతం పలికారు. అంబేదర్ సెంటర్లో సీఐటీయూ జిల్లా కార్యదర్శి బండు సాయిలు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో జయలక్ష్మి మాట్లాడారు. వారికి ప్రతినెలా ఫిక్స్డ్ వేతనం రూ.18వేలు అందజేయాలని డిమాండ్ చేశారు.
గతంలో ధర్నా లు చేసినప్పుడు నాటి కాంగ్రెస్ నాయకుడు, నేటి సీఎం రేవంత్రెడ్డి, ప్రస్తుత మంత్రులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తక్షణమే ఆశ వరర్ల సమస్యలు పరిషరిస్తానని హామీ ఇచ్చారని, అధికారంలోకి రాగానే మరిపోయారని విమర్శించారు. రేవంత్రెడ్డి సీఎం కుర్చీ కోసం ఆశ వరర్లను పూర్తిగా మోసం చేశారని ఆరోపించారు. సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన చేపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.