కొత్తగూడెం ప్రగతి మైదాన్, అక్టోబర్ 11 : భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో జవాన్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో శనివారం చోటుచేసుకున్నది.
ఉసూర్ బ్లాక్‌లోని పూజారీ కాంకేర్-తాడపల్ల సమీపంలో కోబ్రా-206వ బెటాలియన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్ దీపక్ దూలే.. మావోయిస్టు లు అమర్చిన మందుపాతరపై కాలు వేశాడు. దీంతో అది పేలడంతో దీపక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తోటి జవాన్లు క్షతగాత్రుడిని జిల్లా కేంద్రంలోని దవాఖానకు తరలించారు.