
పాలకవీడు, జనవరి 26 : సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్పహాడ్ దర్గా ఉర్సు గురువారం నుంచి ప్రారంభంకానున్నది. మూడు రోజులపాటుసాగే ఈ ఉత్సవాలకు రాష్ట్రంతోపాటు ఏపీ నుంచి సైతం భక్తులు తరలివస్తారు. ఉత్సవానికి లక్ష మందికిపైగా భక్తులతోపాటు పలువురు రాష్ట్ర ప్రముఖలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఉత్సవాల నేపథ్యంలో దర్గా వద్ద పనులకు ప్రభుత్వం రూ.7.50 లక్షలు కేటాయించింది. గురువారం సైదులు బాబా సమాధుల వద్ద కొవ్వొత్తులు వెలిగిస్తారు. 28న గంధం ఊరేగింపు, 28న ఉదయం ప్రత్యేక దర్శనాల అనంతరం 29న సాయంత్రం దీపారాధనతో ఉర్సు ముగుస్తుంది.