Sandeep Kumar Jha | మా పొట్ట కొట్టద్దు.. కనికరించండి..జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కాళ్లు పట్టుకున్న దళిత దంపతులు
Sandeep Kumar Jha | ‘కనికరించండి సార్.. మా పొట్టకొట్టొద్దు’ అంటూ శుక్రవారం జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కాళ్లు పట్టుకుని వేడుకున్నారు దళిత దంపతులు పాలమాకుల చిన్న మంజుల, కనకయ్య. ఇందిర మహిళా శక్తి పథకంలో భాగంగా జనగామ కలెక్టరేట్‌కు సమీపంలో ఆరు నెలల క్రితం అధికారుల సూచన మేరకు పాలమాకుల చిన్న మంజుల వనిత టీ స్టాల్,
Sandeep Kumar Jha | జనగామ చౌరస్తా, మార్చి 20 : ‘కనికరించండి సార్.. మా పొట్టకొట్టొద్దు’ అంటూ శుక్రవారం జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కాళ్లు పట్టుకుని వేడుకున్నారు దళిత దంపతులు పాలమాకుల చిన్న మంజుల, కనకయ్య.
ఇందిర మహిళా శక్తి పథకంలో భాగంగా జనగామ కలెక్టరేట్‌కు సమీపంలో ఆరు నెలల క్రితం అధికారుల సూచన మేరకు పాలమాకుల చిన్న మంజుల వనిత టీ స్టాల్, పొత్కనూరి విజయలక్ష్మి విజయ మిల్క్ పార్లర్‌ను ఏర్పాటు చేసుకోగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు వాటిని తొలగించడానికి రెవెన్యూ, మున్సిపల్, డీఆర్డీఏ, పోలీసు అధికారులు చర్యలు చేపట్టారు. గత్యంతరం లేక బాధితులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఏప్రిల్ ఒకటిన ఈ కేసు విచారణ వచ్చే వరకు వాటిని తొలగించొద్దంటూ హైకోర్టు న్యాయమూర్తి ఈ నెల 18న స్టేటస్కో జారీచేశారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం ఫుడ్ ఇన్స్పెక్టర్ వనిత టీ స్టాల్లో తనిఖీలు నిర్వహించారు. అంతగా చదువురాని చిన్న మంజులతో ఖాళీ కాగితాలపై సంతకాలు తీసుకొని కలెక్టర్ వద్దకు వెళ్లినట్టు బాధితులు రోదించారు. రోజుకో విధంగా అధికారుల వేధింపులు తట్టుకోలేకపోతున్నామని, తమ బతుకుదెరువును కాపాడాలంటూ వారు నేరుగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను కలిసి కాళ్లమీద పడి బతిమాలాడుకునే ప్రయత్నం చేశారు.
కాళ్లు పట్టుకున్నా కనికరించని సైకో కలెక్టర్
జనగామ కలెక్టరేట్ సమీపంలో టీ స్టాల్, మిల్క్ పార్లర్లు పెట్టుకొని జీవనం సాగిస్తున్న పాలమాకుల చిన్న మంజుల, పొత్కనూరి విజయలక్ష్మి కుటుంబాలు
వీరి పొట్ట కొడుతూ టీ స్టాల్, మిల్క్ పార్లర్లను తొలగించాలని అధికారులకు ఆదేశాలిచ్చిన కలెక్టర్ సందీప్… https://t.co/zT03MoOywo pic.twitter.com/Q9C0h8P5ue
— Telugu Scribe (@TeluguScribe) March 21, 2026
దళిత, బహుజన ఆడబిడ్డలపై కలెక్టర్ వేధింపులు : సీపీఎం
జనగామ కలెక్టరేట్‌కు సమీపంలో వనిత టీ స్టాల్, విజయ మిల్క్ పార్లర్‌ను ఏర్పాటు చేసుకున్న దళిత, బహుజన బిడ్డలు పాలమాకుల చిన్న మంజుల, పొత్కనూరి విజయలక్ష్మిపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వేధింపులు సరికాదని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బొట్ల శేఖర్ అన్నారు. అధికార యంత్రాంగం తన చేతిలో ఉన్నదని, కలెక్టర్ రోజుకో విధంగా అధికారులను వనిత టీ స్టాల్, మిల్క్ పార్లర్ వద్దకు పంపించి తనిఖీల పేరిట భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వారి వ్యాపారం జరగకుండా అడ్డుకోవడం సరికాదని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

