Pawan Kalyan | తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రచారం చేయనున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది.
ఈ నెల 7, 8వ తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి, పవన్ కల్యాణ్ ప్రచారం చేయనున్నారు. దీనికి సంబంధించి ప్రచార షెడ్యూల్ రూట్‌మ్యాప్‌ను తొందరలోనే ప్రకటిస్తామని జనసేన పార్టీ తెలిపింది. కాగా, ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన పార్టీ ముందుగా భావించింది. కానీ ఏపీలో బీజేపీతో ఉన్న పొత్తు కారణంగా ఆ ఆలోచనను విరమించుకుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో బీజేపీని బలపరుస్తూ ప్రచారం చేయాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు.

Janasena