ఎల్లారెడ్డి రూరల్, జనవరి 9: మోసపూరిత హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దారుణంగా మోసం చేసిందని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ధ్వజమెత్తారు.
రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా ఎల్లారె డ్డి తహసీల్ కార్యాలయం ఎదుట శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ధర్నాలో ఆయన మాట్లాడా రు. కేసీఆర్ పాలనలో రైతులు సంతోషం గా ఉన్నారని, కాంగ్రెస్ వచ్చాక పరిస్థితి అధ్వానంగా మారిందని పేర్కొన్నారు.