గొల్లపల్లి, మే 14 : ‘కాంగ్రెస్ సర్కార్ ప్రజ లు, రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నది. అందరినీ అవస్థలకు గురిచేస్తున్న కాంగ్రెస్ పార్టీలో నేను ఉండలేను’ అని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం అబ్బాపూర్ గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కుల ధనుంజయ్ స్పష్టంచేశాడు. గురువారం ఆయన తన రాజీనామా పత్రాన్ని మీడియాకు అందించడంతోపాటు సోషల్ మీడియాలో పెట్టాడు. కాంగ్రెస్లో విలువలు లేవ ని, పనిచేసే కార్యకర్తల కు గుర్తింపు లేదని, వివక్షకు గురవుతున్నట్టు పేర్కొన్నాడు.
ము ఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నదని వాపోయాడు. కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు జరుగుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించాడు. బీఆర్ఎస్ ప్రభు త్వం ఉన్నప్పుడు రైతులకు పూర్తిగా భరోసా ఉండేదని అన్నాడు. ఇకపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్వర్యంలో బీఆర్ఎస్లో చేసి ప్రజలు, రైతుల కోసం పనిచేస్తానని ధనుంజయ్ ప్రకటించాడు.