హైదరాబాద్ : బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస పాలనపై విసుగు చెందిన ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్, తిమ్మాపూర్ తండా గ్రామాలకు చెందిన 25 మంది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు మాజీ వైస్ ఎంపీపీ నోముల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్లగులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీలోనే కార్యకర్తలకు సరైన గౌరవం లభిస్తుందన్నారు. పార్టీలో చేరిన ప్రతికార్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. పార్టీ అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.