హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : సీఎం సీటు నుంచి రేవంత్రెడ్డి దిగిపోయాక తాను సీఎంని అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టీ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం గాంధీభవన్లో మాట్లాడుతూ.. రాబోయే మూడేండ్లు సీఎంగా రేవంత్ కొనసాగుతారని, ఆయనను మార్చే అవకాశం లేదని పేర్కొన్నారు.
వచ్చే ఐదేండ్లు మళ్లీ సీఎం కావడానికి రేవంత్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తొమ్మిదేండ్ల తర్వాత సీఎం కావాలనే టార్గెట్తో తాను పనిచేస్తున్నానని జగ్గారెడ్డి స్పష్టంచేశారు. రేవంత్రెడ్డి సీఎం సీటు నుంచి దిగిపోగానే .. సీఎం పీఠం కోసం ప్రజలకు దరఖాస్తు పెట్టుకుంటానని చెప్పారు.