హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు జిట్టా బాలకృష్ణా రెడ్డిని(Jitta Balakrishna Reddy) ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులతో కలిసి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy) పరామర్శించా. కాగా, అనారోగ్యం కారణంగా గత కొన్ని రోజులుగా హైదరాబాద్లోని యశోద హాస్పిటల్లో(Yashodha hospital) చికిత్స పొందుతున్న బాలకృష్ణా రెడ్డికి అందిస్తున్న వైద్య వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. అదే విధంగా జిట్టా బాలకృష్ణా రెడ్డి కుటుంబ సభ్యులతోనూ మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని, జిట్టా కోలుకుంటున్నారని భరోసానిచ్చారు.
Also Read..