సూర్యాపేట : కాంగ్రెస్ పాలనలో(Congress rule) రైతులకు కన్నీళ్లే మిగిలాయి. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై సమీక్ష చేసే సోయి ముఖ్యమంత్రి, మంత్రులకు లేకపోయిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి(
Jagadish Reddy) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రులపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతాంగాన్ని గాలి వదిలేసి.. వ్యాపారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఢిల్లీకి డబ్బు మూటలు పంపుతున్నారని ఆరోపించారు. తక్షణమే రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి.. ఆయా జిల్లాల్లో మంత్రులు కరువు మీద సమీక్ష చేయాలని డిమాండ్ చేశారు. కర్ణాటక సీఎంతో ముఖ్యమంత్రితో మాట్లాడి.. ఆల్మట్టి నుంచి పది టీఎంసీలు నీరు విడుదల చేయించాలని సూచించారు. అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలో తీవ్ర ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతందన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాడుతామన్నారు.