నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (వైటీపీఎస్)లో యాష్, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ పనులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించొద్దంటూ వీర్లపాలెంలో ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఏడు రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి ‘సేవ్ ద వైటీపీఎస్, సేవ్ ద జెన్కో’ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందుండి కొట్లాడిన విద్యుత్తు ఉద్యోగులు మరో పోరాటానికి రెడీ అవుతున్నారు. విద్యు త్తు రంగంలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. డిమాండ్ల పరిష్కారానికి ఉద్యమబాట పట్టనున్నారు. రెండు జేఏసీలు వేర్వేరు పోరాటాలకు రెడీ అవుతున్నాయి. ఇప్పటివరకు వినతిపత్రాలతో సరిపుచ్చిన నేతలు ఇప్పుడు పోరుబాట పట్టనున్నారు. దీంతో అటు విద్యుత్తు సౌధ, మింట్ కంపౌండ్లు ఉద్యమాలతో దద్దరిల్లనున్నాయి. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేఏసీ రంగంలోకి దిగాయి. ముఖ్యంగా యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణను జేఏసీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రైవేటీకరణ టెండర్లను రద్దుచేయాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నా రు. గురువారం సీఎండీలను కలిసి వినతిపత్రాలు సమర్పించిన జేఏసీ నేతలు, శుక్రవా రం ఆందోళనబాట పట్టారు. వైటీపీఎస్ ఓఅండ్ఎం, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల ప్రైవేటీకరణకు పూనుకోవడాన్ని నిరసిస్తూ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ శుక్రవారం అన్ని విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్లలో మధ్యాహ్న భోజన సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలకు దిగారు. శనివారం నిరసనలను విజయవంతం చేయాలని పవర్ జేఏసీ పిలుపునిచ్చింది. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేఏసీ సైతం ఉద్యమబాట పట్టనున్నది. యాదాద్రి పవర్ ప్లాంట్‌ను సింగరేణి సంస్థకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నది.
జెన్కో పూర్తిగా నిర్వీర్యం
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్యుత్తు సంస్థలను గాలికొదిలేశారు. కొత్త వి ద్యుత్తు ప్లాంట్లు నెలకొల్పడం, స్థాపిత విద్యు త్తు సామర్థ్యాన్ని పెంచడంలో దారుణంగా విఫలమయ్యారు. ఫలితంగా స్థాపిత విద్యుత్తు సామర్థ్యంలో తెలంగాణ అత్యంత వెనుకబడింది. ఈ విషయంలో సర్కార్‌కు ఓ విజన్ లేకుండా పోయిందన్న విమర్శలున్నాయి. వైఎస్సార్ హయాంలో జెన్కో పెద్దఎత్తున థర్మల్ప్లాంట్లను నెలకొల్పింది. ఆ తర్వాత కేసీఆర్ హయాంలోనూ జెన్కో థర్మల్‌ప్లాంట్లు, జల వి ద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటుచేసింది. ఈ రెండున్నరేండ్లలో కాంగ్రెస్ ఒక్క కొత్త ప్లాంట్‌ను ఏర్పాటుచేయలేదు. 2023 తర్వాత రామగుండంలో 800 మెగావాట్ల ప్లాంట్ కడుతామని ప్రకటించినా, ఒక్క అడుగు ముందుకు పడలేదు. కొత్తగూడెంలో ఏర్పాటుచేయాల్సిన మరో ప్లాంట్ ఊసే లేదు. అనువుగాలేని హిమాచల్‌ప్రదేశ్‌లో జల విద్యుత్తు ప్లాంట్లు నెలకొల్పేందుకు ఆ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకున్నది. పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లను కేంద్రం మంజూరుచేస్తే వీటిని ప్రైవేట్‌కు అప్పగించారు. 1,500 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజీ ప్లాంట్లు కేటాయిస్తే, వాటిని ప్రైవేట్‌కు కట్టబెడుతున్నారు. 4వేల మెగావాట్ల సోలార్ ప్లాంట్లకు కేంద్రం అనుమతిస్తే వాటిపై అతీగతీ లేదు. జెన్కోను కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నది. తాజాగా వైటీపీఎస్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించేందుకు రంగం సిద్ధం చేసింది. దీంతో ఇంజినీర్లు, ఎంప్లాయీస్ జేఏసీలు జంగ్కు రెడీ అవుతున్నారు.
ఆంధ్రా ఆధిపత్యంపై కుతకుత
విద్యుత్తు సంస్థల్లో ఇప్పటికీ ఆంధ్రా అధికారుల అధిపత్యమే నడుస్తున్నది. పోస్టింగులు, నియామకాల్లో ఆంధ్రా స్థానికత గలవారికే స ర్కార్ పెద్దపీట వేస్తున్నది. దీంతో స్వరాష్ట్రాన్ని సాధించుకుని ప్రయోజనమేంటన్న ప్రశ్నలు ఇంజినీర్లలో వ్యక్తమవుతున్నాయి. దక్షిణ డిస్క మ్ డైరెక్టర్లంతా ఆంధ్రావారే. సీఈఐజీగా నెల్లూరు జిల్లాకు చెందిన నందకుమార్‌ను ఏ డాది కాలానికి సర్కార్ నియమించింది. ఇటీవలే ఆయన పదవీకాలాన్ని ఏడాది పొడిగించింది. రెడ్కో చైర్మన్‌గా నెల్లూరు జిల్లాకు చెంది న అనిలను నియమించారు. జెన్కోకు ఇద్దరు ఆంధ్రా స్థానికత గల డైరెక్టర్లు ఉన్నారు. ట్రాన్స్‌కోలోనూ ఆంధ్రా వారికే కీలక పదవులు కట్టబెడుతున్నది. రైతు డిస్కమ్లోనూ ఆంధ్రావాళ్లే నిండిపోయారు. వీటిపై తెలంగాణ ఇంజినీర్లు, ఉద్యోగులు కుతకుతలాడుతున్నారు.
జేఏసీ ప్రధాన డిమాండ్లు..