హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన అధికారులపై జరిగిన దాడిపై సమగ్ర విచారణ జరపాలని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మెన్ వీ లచ్చిరెడ్డి కోరారు. సోమవారం లగచర్ల పర్యటనకు వచ్చిన జాతీ య ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
కార్యక్రమంలో జేఏసీ నేత లు నిర్మల, జీఎస్ కుమారస్వామి, ఎస్ రాములు, రమేశ్ పాక, దర్శన్ గౌడ్, ఫూల్సింగ్ హాన్, రాధ పాల్గొన్నారు.