మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 10, 2020 , 16:40:16

మొక్కలు నాటిన జబర్దస్త్‌ అవినాష్‌, నేహంత్‌

మొక్కలు నాటిన జబర్దస్త్‌ అవినాష్‌, నేహంత్‌

హైదరాబాద్‌ : జబర్దస్త్‌ నటులు ముక్కు అవినాష్‌, నేహంత్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటారు. జబర్దస్త్‌ రాకేష్‌ విసిరిన గ్రీన్‌ ఛాలెంజ్‌ను స్వీకరించిన వీరు నేడు నగరంలోని నానక్‌రామ్‌గూడలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ... ఎంపీ సంతోష్‌కుమార్‌ శ్రీకారం చుట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఎంతో మంచి కార్యక్రమం అన్నారు. మనందరం మంచి ఆరోగ్యంతో ఉండాలంటే మంచి వాతావరణం అవసరమని అందుకే అందరూ బాధ్యతగా తీసుకుని మొక్కలు నాటాలన్నారు.

ఈ సందర్భంగా అవినాష్‌, నేహంత్‌లు పలువురికి గ్రీన్‌ ఛాలెంజ్‌ను విసిరారు. యాంకర్‌ రాధ, అదిరే అభి, కెవ్వు కార్తిక్‌, నిహారిక కొణిదెల, యోద, యానీమాస్టర్‌లను మొక్కలు నాటాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ సహవ్యవస్థాపకుడు రాఘవ, ప్రతినిధి కిషోర్‌ గౌడ్‌, గచ్చిబౌలి కార్పొరేటర్‌ సాయిబాబా పాల్గొన్నారు.


logo