బూర్గంపహాడ్ ; తమ సమస్యలను పరిష్కరించాలని, హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాకలోని ఐటీసీ కర్మాగారం ఎదుట కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న రిలే దీక్షలు ఆదివారం నాటికి 11వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. 13వ వేతన ఒప్పంద కాలం నాటి సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయని, ఒప్పదం కాలం పూర్తయి వారం దాటుతున్నా నేటికీ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. 14వ వేతన ఒప్పందాన్ని జేఏసీ కలిసి చేయాలని డిమాండ్ చేశారు.