75 వేల లోపు పంట రుణాలు మాఫీ
రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ.75 వేల లోపు పంట రుణాలను మాఫీ చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు 2022-23 బడ్జెట్లో రూ.2,939.20 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్లో ప్రకటించిన రూ.50 వేల లోపు రుణాలన్నింటినీ ఈ నెలాఖరులోగా మాఫీ చేయనున్నట్టు ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 ఎన్నికల్లో రూ.లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.
- బడ్జెట్లో రూ. 2,939.20 కోట్లు కేటాయింపు.. నెలాఖరు కల్లా 50 వేల లోపు రుణమాఫీ పూర్తి
హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ.75 వేల లోపు పంట రుణాలను మాఫీ చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు 2022-23 బడ్జెట్లో రూ.2,939.20 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్లో ప్రకటించిన రూ.50 వేల లోపు రుణాలన్నింటినీ ఈ నెలాఖరులోగా మాఫీ చేయనున్నట్టు ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 ఎన్నికల్లో రూ.లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. తొలి విడతగా ప్రభుత్వం 2020-21 బడ్జెట్లో రూ.25 వేల లోపు రుణాలను మాఫీ చేసింది. దీంతో దాదాపు మూడు లక్షల మంది రైతులు రూ.408 కోట్ల మేర లబ్ధిపొందారు. 2021-22 బడ్జెట్లో రూ.25 వేల నుంచి రూ.50 వేల లోపు రుణాలను మాఫీ చేయనున్నట్టు ప్రకటించారు. ఇందుకు ప్రభుత్వం రూ.2,006 కోట్లు కేటాయించింది. గత ఆగస్టులో రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించిన ప్రభుత్వం ఇప్పటికే సగంమంది రుణాలు మాఫీ చేసింది. ఈ నెలాఖరులోగా మిగిలిన మిగిలిన రైతుల రుణాలను కూడా మాఫీ చేయనున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.50 వేల నుంచి 75 వేల లోపు రుణాలను మాఫీ చేస్తుండటంతో మరో 5.38 లక్షల మంది రైతులు లబ్ధిపొందనున్నారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అప్పట్లో 35.32 లక్షల మంది రైతులకు చెందిన రూ.16,144 కోట్ల రుణాలను టీఆర్ఎస్ ప్రభుత్వం మాఫీ చేసింది. రుణమాఫీ ప్రకటనతో రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

