హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, ఆరు కార్పొరేషన్ల (యూఎల్బీ) పరిధిలోని వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఓటర్లు 52,43,023 మంది ఉండగా, వీరిలో పురుషులు 25,62,369 మంది, మహిళలు 26,80,014 మంది, ఇతరులు 640 మంది ఉన్నట్టు పేర్కొన్నది. పురుషులతో పోలిస్తే 1,17,645 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నట్టు తెలిపింది.

