హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఉచిత కరెంటు గురించి చెప్పినప్పుడు.. అసలు విద్యుతే లేకుండా చేస్తారని తెలంగాణ ప్రజలు ఊహించలేకపోయారన్నారు. సూర్యాపేట జిల్లా మోతె మండలంలో 16 రోజులుగా కరెంటు లేదని చెప్పారు. దీంతో రైతుల బతుకులు తీవ్రంగా దెబ్బ తింటున్నాయని తెలిపారు. భట్టి విక్రమార్క వెంటనే జోక్యం చేసుకుని విద్యుత్‌ను పనరుద్ధరించాలన్నారు. 16 రోజులైనా ప్రభుత్వం విద్యుత్ అంతరాయాన్ని పరిష్కరించలేరా అని ప్రశ్నించారు.
When Revanth Reddy said free electricity, little did people of Telangana imagined that they will be ‘free from electricity’
16 days without electricity in Mothe mandal, Suryapet!! Farmers’ livelihoods are severely impacted. @MalluBhatti Vikramarka, please intervene & restore… pic.twitter.com/4BuEuDsVIR
— KTR (@KTRBRS) September 16, 2024
16 రోజులుగా పవర్ కట్..
16 రోజులుగా వ్యవసాయానికి విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో సూర్యాపేట జిల్లా మోతె మండలంలోని మామిళ్లగూడెం సబ్‌స్టేషన్ వద్ద ఆదివారం రైతులు ధర్నా చేశారు. మామిళ్లగూడెం, కొత్తగూడెం గ్రామాల రైతులు అక్కడికి చేరుకొని ఆందోళన చేశారు. పొలాలకు విద్యుత్తు రావడం లేదని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, పంటలకు నీళ్లు లేక ఎండిపోయే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. విద్యుత్తు అధికారులకు ఫోన్లు చేసినా ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. వర్షాలు వచ్చినప్పటి నుంచి విద్యుత్తు స్తంభాలు, లైన్లు దెబ్బతిన్నాయని, వాటిని పునరుద్ధరించకుండా అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గత ప్రభుత్వంలో రైతులకు 24 గంటల కరెంట్ వచ్చిందని, కాంగ్రెస్ పాలనలో ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పారు. అధికారుల నిర్లక్ష్యానికి పంటలు ఎండిపోతుండటంతో సబ్‌స్టేషన్ ముందు ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోయారు. ఇకనైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి రైతులకు విద్యుత్తును పునరుద్ధరించాలని కోరుతున్నారు.