హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): డీఎస్ఆర్ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో రెండో రోజూ ఐటీ అధికారుల సోదాలు కొనసాగాయి. హైదరాబాద్‌లోని ఆరు సంస్థల్లో, చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి ఇంట్లోనూ అధికారులు సోదాలు చేశారు. డీఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డీఎస్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, డీఎస్ఆర్ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్, డీఎస్ఆర్ ప్రైమ్ స్పేస్ వంటి సంస్థలపై ఐటీ సోదాలు కొనసాగాయి. ఈ దాడుల నేపథ్యంలో అధికారులు భారీ మొత్తంలో పత్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. కంపెనీ అధినేతల బ్యాంకు లాకర్లనూ అధికారులు గుర్తించారని విశ్వసనీయంగా తెలుస్తున్నది.