హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అగ్నిమాపకశాఖను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. శనివారం ఫైర్ ట్రైనింగ్ సెంటర్లో 196 మంది డ్రైవర్ ఆపరేటర్ల పాసింగ్ అవుట్ పరేడ్‌కు ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపత్తు ఎకడ జరిగినా మేమున్నాం అనే ధైర్యం కల్పించేలా ఉండాలని సూచించారు.
హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలం గాణ): రాష్ర్టానికి వస్తున్న ఆదాయం వేత నాలు, ఖర్చులకే సరిపోతున్నదని, అందుకే ఏడాదిగా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడంలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరోక్షంగా అంగీకరించారు. సచివాలయం లో శుక్రవారం ఉద్యోగుల క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘రాష్ర్టానికి ప్రతినెల రూ.18,500 కోట్ల రాబడి వస్తుండగా, ఉద్యోగుల వేతనాలకు రూ.6,500 కోట్లు, అప్పులు చెల్లించేందుకు రూ.6,500 కోట్లు, రూ.5,500 ఉచిత పథకాలకు ఖర్చు చేస్తున్నాం. కనీస అవసరాలకు ప్రతినెల రూ.22,500 కోట్లు కావాలి. వచ్చిన ఆదాయంతో పోలిస్తే రూ.4,000 కోట్లు తకువ పడుతున్నది’ అని సీఎం వివరించారు. దీనిపై ఆర్థిక నిపుణులు స్పందిస్తూ.. ఆదాయ, వ్యయాలపై సీఎం అవగాహన లేమికి నిదర్శమని ఆయన వ్యాఖ్యానించారు.