హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఇప్పటివరకు 1,60,083 ఉద్యోగాలను భర్తీ చేసినట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు వెల్లడించారు. జనాభా ఆధారంగా దేశంలోనే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని మంగళవారం ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వివరాల కోసం https://telanganajob stats.in వెబ్ సైట్ను చూడాలని, దీనిలో అన్ని వివరాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిదిన్నర ఏండ్లలో 2,32,308 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు గుర్తించామని ఆయన పేర్కొన్నారు.