హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసినట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ ఆశించి భంగపడిన వీరికి అధిష్ఠానం ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించినట్టు సమాచారం.